Asian Athletics 2023: ఆసియా అథ్లెటిక్స్ లో స్వర్ణం గెల్చుకున్న జ్యోతి
థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో రెండో రోజైన గురువారం భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలను గెలుచుకున్నారు. దీంతోపాటు కాంస్య పతకం కూడా కైవసం చేసుకున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కూడా ఉండటం విశేషం.
థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్(Asian Athletics 2023)లో 2వ రోజు చివరిలో భారత్ మూడు స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించారు. తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ, అజయ్ కుమార్ సరోజ్, అబ్దుల్లా అబూబకర్ ముగ్గురు గోల్డ్ పతకాలు గెల్చుకున్నారు. జ్యోతి తొలిసారిగా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించడం విశేషం. బ్యాంకాక్‌లో జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో భారత క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ(Jyoti yarraji) 13.09 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకుంది.
ఇక పురుషుల 1500 మీటర్ల ఫైనల్లో మరో ఆశ్చర్యకరమైన బంగారు(gold) పతకం ఇండియాకు దక్కింది. అజయ్ కుమార్ సరోజ్ ఖతార్, చైనా, జపాన్ లను వెనక్కి నెట్టి ప్రసిద్ధ రన్నర్ల కంటే ముందే స్వర్ణం సాధించాడు. మరోవైపు పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్ 16.92 మీటర్ల జంప్‌తో భారత్‌కు మూడో బంగారు పతకాన్ని అందించాడు. అబూబకర్ 16.92 మీటర్ల జంప్ నమోదు చేశాడు. కాగా మహిళల 400 మీటర్ల పరుగులో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతను కామన్వెల్త్ గేమ్స్ 2022లో కూడా లాంగ్ జంప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అప్పటి నుండి, శంకర్ డెకాథ్లాన్ను చేపట్టాడు, ఇది బహుశా అన్ని ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలలో అత్యంత కష్టతరమైనది. డెకాథ్లాన్ అనేది పది ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లతో కూడిన అథ్లెటిక్స్‌లో కలిపి జరిగే ఈవెంట్. డెకాథ్లాన్ ఈవెంట్లో పాల్గొన్న అనేక క్రీడల కారణంగా 2 రోజుల పాటు జరుగుతుంది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్(india) 3 స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023 థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని సుఫాచలసాయి నేషనల్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ జూలై 12న ప్రారంభమై జూలై 16న ముగుస్తుంది.
👟 Jyothi Yarraji wins first gold for India🇮🇳 in women’s 100m hurdles. She clocks 13.09 secs at 2023 Asian #Athletics Championships in Bangkok pic.twitter.com/mGrQiMzvD4
— Doordarshan Sports (@ddsportschannel) July 13, 2023