SRPT: సూర్యాపేట మున్సిపాలిటీలో పారిశుధ్యం పడకేసింది. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కేవలం ఆర్భాటాలకే పరిమితమైందని జనం మండిపడుతున్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి, మురుగు కాలువలు అధ్వానంగా మారాయి. దోమల వృద్ధి, దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు ఫోటోలకు ఇస్తున్న ప్రాధాన్యత సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.