ADB: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శనివారం తాంసి మండలం కప్పర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులున్నారు.