AP: ఉపాధి హామీ పనిచేస్తున్న మహిళలు చాలా గొప్పవాళ్లని ఏపీసీసీ చీఫ్ షర్మిల కొనియాడారు. ఇలాంటి చాకిరీ చేయడం సామాన్యమైన పని కాదని, అయినా గట్టిగా నిలబడి శ్రమ చేస్తూ, కుటుంబాలకు ఆసరగా నిలబడుతున్న ప్రతి మహిళకు వందనం అని పేర్కొన్నారు. MGNREGA పరిరక్షణ యాత్రలో భాగంగా పాయకరావు పేట నియోజకవర్గం వెదురుపాలెంలో కరువు పని శ్రామికులకు భరోసా నింపేందుకు, వారితో కలిసి మట్టి తవ్వారు.