ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు కేటాయించిన పునరావాస కాలనీలో పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జేసి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శనివారం సబ్ కలెక్టరేట్లో వెలుగొండ ప్రాజెక్టు సిబ్బందితో పాటు మార్కాపురం, పెద్దారవీడు, అర్ధవీడుకు చెందిన రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. R&R ప్యాకేజీ వివరాల గురించి ఆరా తీశారు.