వివాదాస్పద రన్ ఔట్ ఘటనపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించాడు. ‘నిబంధనల ప్రకారం నా రన్ ఔట్ సరైనదే కావచ్చు, కానీ అదే స్థానంలో నేను ఉంటే మాత్రం క్రీడా స్ఫూర్తికే ప్రాధాన్యత ఇచ్చేవాడిని’ అని పేర్కొన్నాడు. అలాగే, ‘నేను పరుగు కోసం ప్రయత్నించలేదు. కేవలం బంతిని తిరిగి ఇచ్చే క్రమంలోనే క్రీజు వెలుపలికి వచ్చాను. కానీ అవతలి వ్యక్తి ఆలోచన మాత్రం వేరుగా ఉంది’ అని అసహనం వ్యక్తం చేశాడు.