NGKL: వచ్చే బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా DYFI ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి, యువత సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.