MBNR: ఫుట్ పాత్ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలను ఆయన పరిశీలించారు. ఆక్రమణలు ఇలాగే కొనసాగితే ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతుందని వెల్లడించారు. ఆక్రమణలు చేయకుండా వ్యాపారం చేయాలన్నారు.