రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ప్రస్తుత ఓనర్లు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. అయితే, స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ EQT గ్రూప్ RCBని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.17 వేల కోట్లతో బిడ్ వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మార్చి 31 నాటికి అమ్మకపు ప్రక్రియ పూర్తి కానుంది.