AP: ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో మెగా క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్, డిప్యూటీ జోనల్ మేనేజన్ ఎం.శేషగిరిరావు లబ్ధిదారులకు రూ.260 కోట్ల విలువైన రుణాల మంజూరు పత్రాలను అందజేశారు. అదే విధంగా ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పలువురు లబ్ధిదారులకు రూ.1,422 కోట్ల రుణాలను పంపిణీ చేశారు.