ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కొంతమంది గ్యాస్ కొరత ఉన్నట్లుగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.