వేయించిన శనగపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.