VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’లో భాగంగా శనివారం వేకువజామున డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో కొత్తవలస 202 కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానస్పద ఉన్న ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. వాహనపత్రాలు లేని 5 వాహనాలు, ఒక కారు, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ షణ్ముఖరావు, ఎస్సై, సిబ్బంది ఉన్నారు.