ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరంలో వివాహానికి హాజరై కొండపల్లికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జడ్డంగి పోలీసులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.