SKLM: ఆమదాలవలస పట్టణంలోని లక్ష్మీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 మందికి పైగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్ష కిట్లను జనసేన ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీ.రామ్మోహన్ రావు శనివారం విద్యార్థులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్ష సమయంలో ఆందోళన చెందకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.