NLG: చిట్యాల పట్టణంలోని హైస్కూల్ పక్కన, వనిపాకల మూల మలుపు వద్ద గేట్ వాల్‌పై మూత లేకపోవడం ప్రమాదకరంగా మారింది. ఈ చిత్రం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో తెరిచి ఉన్న గేట్ వాల్ వల్ల వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.