2027 వరల్డ్ కప్ నేపథ్యంలో IPL తర్వాత భారత్ వన్డేలపై దృష్టిపెట్టనుంది. వన్డేలు ఎక్కువగా ఆడితేనే టోర్నీకి ప్రాక్టీస్ అవుతుందని BCCI యోచన. ఈ క్రమంలోనే భారత జట్టుకు ఆతిథ్యమిస్తామంటూ చాలా జట్లు అభ్యర్థిస్తున్నాయి. దీంతో జూలైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత్.. ఆ పక్కనే ఉన్న ఐర్లాండ్తోనూ వన్డేలు ఆడే ఛాన్స్ ఉంది. ఆగస్టులో లంక పర్యటనలో 2 టెస్టులతో పాటు వన్డేలూ అవకాశముంది.