NGKL: ఊర్కొండ మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ డీకే అరుణమ్మ రూ. 70 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ డీకే అరుణమ్మ ప్రత్యేకంగా ఈ నిధులను కేటాయించారని తెలిపారు.