MBNR: జడ్చర్లలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డితో కలిసి రూ.4.33 కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం 99 రోజుల యాక్షన్ ప్లాన్ పోస్టర్ను ఆవిష్కరించి ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక నేతలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.