కృష్ణా: పెడపారుపూడి మండలం జువ్వనపూడి గ్రామంలో పాగోలు రాజ్ సౌమిత్ (మున్నా) సహకారంతో నిర్మించిన నూతన బస్ స్టాప్‌ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.