KDP: మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్‌ను శుక్రవారం పలువురు ఘనంగా సన్మానించారు. కడప కలెక్టరేట్‌లొ సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విద్వాన్ గానుగ పెంట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ చేతుల మీదుగా సన్మానం పొందారు. చరిత్రకు సంబంధించి ఆయన చేస్తున్న పరిశోధనలకు ఈ సత్కారం లభించింది.