KKD: యానం డీజిల్‌ను గొల్లలమామిడాడకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కరప ఎస్సై సునీత బృందం శుక్రవారం పెనుగుదురు వద్ద వాహనాలు తనిఖీ చేశారు. కాకినాడ మీదుగా వెళ్తున్న బొలెరో ట్రక్కును తనిఖీ చేయగా అందులో 2 వేల లీటర్ల డీజిల్ పట్టుబడిందని ఎస్సై తెలిపారు. ఈ తనిఖీలలో సివిల్ సప్లై, రవాణా, తూనికలు కొలతలు, వాణిజ్య పన్నుల అధికారులు పాల్గొనట్లు ఎస్సై వెల్లడించారు.