WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఇటీవలే పాముకాటుతో మరణించిన మిత్రురాలి కుటుంబానికి 2006-2007 టెన్త్ బ్యాచ్ స్నేహితులు అండగా నిలిచారు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని, మానవతా దృక్పథంతో శుక్రవారం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులందరినీ మండల ప్రజలు అభినందించారు.