NRPT: కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామ శివారులో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గస్తీ నిర్వహిస్తున్న సమయంలో వీటిని గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్సై నవీద్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.