WGL: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాలో అంతరాయాలు, బుకింగ్ చేసినా 10 రోజులు దాటినా సిలిండర్ రాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్ట్రిక్ స్టవ్‌ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. గత నాలుగు రోజుల్లోనే 2 వేలకు పైగా ఎలక్ట్రిక్ స్టవ్‌లు అమ్ముడైనట్లు డీలర్లు తెలిపారు. పట్టణంలో 50కి పైగా కంపెనీల షోరూమ్‌లు, డీలర్‌షిప్‌లలో డిమాండ్ గణనీయంగా పెరిగింది.