గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల విరామం ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సులభమవుతుంది. ప్రతిరోజూ ఆహారంలో పెరుగు లేదా మజ్జిగ చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.