భువనగిరి: భవిష్యత్ తరాల కోసం నీటి ఎద్దడిని నివారించేందుకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణపై ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.