NZB: చెస్ ఆటతో విద్యార్థుల మేథస్సు పెరుగుతుందని చెస్ నెట్వర్క్ సంస్థ ప్రతినిధి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్‌లో మండల పరిధిలోని ప్రతి పాఠశాలకు, కేజీబీవీలకు, రెసిడెన్షియల్ స్కూళ్లకు టీచర్లు, ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా చెస్ బోర్డులను పంపిణీ చేశారు.