వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం తరఫున జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రేపు స్టార్ ఫంక్షన్ హాల్ నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.