పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే అన్నా లెజినోవా తన పిల్లలను తీసుకొని రష్యా వెళ్లిపోయిందని, ఇక తను రాదన్న వార్తులు చెక్కర్లు కొడుతున్నాయి.
Pawan Kalyan: సినిమా పరిశ్రమలో(Film industry) ఏది జరిగినా విపరీతమైన పబ్లిసిటీని సంతరించుకుంటుంది. అది ప్రేమ నుంచి పెళ్లి అయినా, బ్రేకప్ నుంచి విడాకులు అయినా.. తాజాగా మెగాబ్రదర్ నాగబాబు కూతురు ప్రముఖ నటీ నిహారికా(Niharika) తన హస్బెండ్ తో విడాకుల(Divorce) వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన తరుణంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన మూడవ భార్యతో కూడా విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. గత కొంత కాలంగా మెగా కుటుంబంలో విడాకుల(Divorce)కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకొని అతనితో ఓ బిడ్డకు జన్మనిచ్చాక విడాకులు తీసుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు నటుడు కళ్యాణ్ దేవ్ ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. వీరిద్దరి వైవాహిక బంధంలో ఓ పాప జన్మించింది. కొన్ని వ్యక్తిగత కారణాల వలన శ్రీజ తన రెండ భర్తతో విడాకులు తీసుకుందని, వీరిద్దరు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
మరో వైపు జనసేనా ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) కూతురు నిహారికా కూడా ఈ వార్తలతోనే మీడియాలో నిలిచింది. 2020లో జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక అతనికి డైవర్స్ ఇచ్చిందని కొన్నాళ్లుగా వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఇరువురు తమ సోషల్ మీడియాలో అన్ ఫాలో అవడం, వారిద్దరికి సంబంధించిన ఫోటోలను వారి అకౌంట్ల నుంచి తొలగించడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వార్తలు జోరుగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 4న దీనిపై క్లారిటీ వచ్చింది. హిందూ వవాహ చట్ట ప్రకారం నిహారిక విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. కోర్టు గత నెల 5న వారికి విడాకులు మంజూరు చేసింది. ఈ దరఖాస్తు నెట్టింట వైరల్ కావడంతో నిహారిక- చైతన్య విడాకుల విషయం నిజమేనని తేలిపోయింది. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడనే మరో ప్రచారం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన మూడవ భార్యకి దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తన భార్యతో ఎక్కడా కనిపించకపోవడంతో ఆమెతో కూడా విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలను యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు సాక్ష్యంగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థాన్ని(Varun Tej – Lavanya Tripathi engagement) చూపిస్తున్నారు. మెగా కుటుంబంలో సంబరంగా జరుగుతున్న ఈ వేడుకకి పవన్ కళ్యాణ్ ఒంటరిగా రావడంతో తన మూడో భార్య నుంచి కొద్ది రోజులుగా పవన్ దూరంగా ఉంటున్నాడని చెప్పుకొస్తున్నారు. చాలా రోజుల క్రితమే పవన్ సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhinova) పిల్లలను తీసుకొని రష్యా వెళ్లిపోయిందని, ఇక తను రాదని చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2013లో అన్నాలెజినోవాని వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు పొలెనా అంజనా పవనోవా, కుమారుడుకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.