MBNR: AIU టోర్నమెంట్లలో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ తైక్వాండో పురుషుల జట్టు, రెజ్లింగ్ మహిళల జట్టు హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే పోటీలకు బయలుదేరాయి. ఉపకులపతి ప్రొ జీ.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొ. పీ. రమేష్ బాబు, పీడీ డా. వై శ్రీనివాస్ పాల్గొన్నారు.