AP: బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా కార్యక్రమం భిన్నమైందన్నారు. ఎస్సీలను ఓటు బ్యాంక్‌గా చూసేవారికి బుద్ధి చెప్పాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని తెలిపారు. అంబేద్కర్ వల్లే ఎస్సీలకు గౌరవం వచ్చిందని పేర్కొన్నారు.