రాబోయే ఎన్నికల్లో(Elections) విజయమే లక్ష్యంగా బీజేపీ(BJP) తెలుగు రాష్ట్రాల్లో అనేక మార్పులు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే నేడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati purandeswari)ని నియమించింది. సోము వీర్రాజు(Somuveerraju)ను తప్పించి పురందేశ్వరికి ఆ పదవిని కట్టబెట్టింది. ముందుగా అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించాయి. అయితే ఆఖరికి అధిష్టానం ఆ పదవిని పురందేశ్వరికి ఇచ్చింది.
తెలంగాణలో కూడా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి(Kishan Reddy)ని నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. బండి సంజయ్ కు మరో కీలక పదవి ఇవ్వనున్నట్లు బీజేపీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పురందేశ్వరి, కిషన్ రెడ్డిలను ఆయా రాష్ట్రాల అధ్యక్షులుగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.