ASR: గిరిజన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జనతా వారధి కన్వీనర్ మినుముల గోపాలపాత్రుడు కోరారు. ఈమేరకు శుక్రవారం జనతా వారధి సభ్యుడు వెంకటరమణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవితో కలిసి పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులకు వినతి అందజేశారు. పలు గ్రామాల్లో గిరిజనులు, కలుషిత నీటి వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు.