ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ డిపోలోని డ్రైవింగ్ కాలేజీలో ఆసక్తి గల నిరుద్యోగులకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయానా బేగం తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. శిక్షణ కోర్సు ఫీజు రూ.20,000తో పాటు జీఎస్టీ రూ.3,600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.