ELR: బుట్టాయగూడెం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. పరీక్షలను చూసి భయపడకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. ఉన్నత చదువులు అభ్యసించి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలన్నారు.