2026 అక్టోబర్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్, కివీస్ జట్లు 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పరంగా ఈ టెస్ట్ సిరీస్ కీలకం కానుంది. అలాగే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. కివీస్ గడ్డపై భారత్ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.