KRNL: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో తగిన వసతులు కల్పించాలని AISF జిల్లా ఉపాధ్యక్షుడు S. ఈరేష్, మండల కార్యదర్శి సాయి వర్మ డిమాండ్ చేశారు. కౌతాళం MEO శోభారాణికి వినతిపత్రం అందజేశారు. ఎండల దృష్ట్యా చల్లని త్రాగునీరు, ఫ్యాన్లు, సరిపడా వెలుతురు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ORSప్యాకెట్లు ఏర్పాటు చేయాలని కోరారు.