»Suicide Of A Student Chaitanya In Narayana Medical College Hostel
Medical student: మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య..గొడవలే కారణమా?
ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో 23 ఏళ్ల విద్యార్థిని ఊరివేసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ నెల్లూరు(nellore)లోని నారాయణ మెడికల్ కాలేజీ(narayana medical college)లోని హాస్టల్ గదిలో హౌస్ సర్జన్ చైతన్య(23) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఈ విద్యార్థిని కళాశాల హాస్టల్లో ఉంటోంది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహమైంది. అయితే ఇంట్లో గొడవల కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు(police) అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కాలేజీలో ఏదైనా సీనియర్లతో గొడవలు లేదా ఇంకేదైనా అంశాలు ఆమె మృతికి కారణామా అనే కోణాల్లో కూడా పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు.