KDP: బద్వేల్ మండలం బోయిలోరుపల్లిలోని రేషన్ షాప్ను బద్వేల్ తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు, DT. శివశంకర్ శుక్రవారం తనిఖీ నిర్వహించారు. షాపులో నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆక్రమాలకు పాల్పడకుండా ప్రజలకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.