BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీ.ఆర్ నగర్ బాంబుల గడ్డలో నూతన రేషన్ షాపును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడమే గాక సన్న బియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.