భారత జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో టైటిల్ సాధించాడు. లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో సూపర్ ఫామ్‌తో చెలరేగాడు. టైటిల్ నెగ్గడంతో అగ్రస్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ టోర్నీలోకి ఎంటరైన నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. జావెలిన్‌ను 87.66 మీటర్లు విసిరి విజయం సాధించాడు. మొదటగా తన తొలి ప్రయత్నంలో నీరజ్ విఫలమయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు తన బల్లెంను విసిరి పర్వాలేదనిపించాడు.
అయితే నాలుగో ప్రయత్నంలో మళ్లీ నీరజ్ చోప్రా(Neeraj Chopra) విఫలం అవ్వడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో బల్లెంను 87.66 మీటర్లు విసిరి ఒక్కసారిగా మొదటి స్థానంలో చేరిపోయాడు. నీరజ్ చోప్రా తర్వాత రెండో స్థానంలో జర్మని అథ్లెంట్ జులియన్ వెబర్ నిలిచాడు. అతను 87.03 మీటర్లు బల్లెంను విసిరి ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్) 86.13 మీటర్ల దూరంలో తన బల్లెంను విసిరాడు.