Women tear Manipur CM Biren Singh’s resignation letter
Manipur CM Biren Singh: మణిపూర్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ కంటిన్యూ అవుతోంది. దీంతో కలత చెందిన ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ అనుసూయా ఉకేని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. బిరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో.. రాజ్ భవన్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు.
రాజ్ భవన్ వచ్చిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. సీఎం కాన్వాయ్ రాజ్ భవన్ వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాదు రాజీనామా లేఖను చించివేశారు. రాజ్ భవన్ వెళ్లొద్దని కోరుతున్నారు. రాజీనామా లేఖ చింపి.. సీఎం పదవీకి రిజైన్ చేయొద్దని కోరారు. సీఎంగా రాజీనామా చేయొచ్చు.. లేదంటే కేంద్రం జోక్యం చేసుకోవద్దని ది సంగై ఎక్స్ ప్రెస్ రాసింది.