గత కొద్ది రోజులుగా ఖుషి మూవీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్గా, దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ‘ఖుషి’ 2001లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కెరీర్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. అందుకే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 31న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది. ఇంతకు ముందు ‘జల్సా’ రీ రిలీజ్ కన్నా ‘ఖుషి’ మూవీకి ఎక్కువ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కోటి దాటినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. రీ రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ఖుషి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లేనని అంటున్నారు. అంతేకాదు.. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ సినిమా వందకుపైగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతోందట. ప్రసాద్ ఐమాక్స్‌లోనే పదికిపైగా షోలను వేస్తున్నారట.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 300 థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా కొన్ని స్క్రీన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఈ ఇయర్ ఎండింగ్‌ని పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీతో సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అందుకే ఖుషికి ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. మరి మొత్తంగా ఖుషి ఎంత రాబడుతుందో చూడాలి.