»Once Again Sejal Attempted Suicide At Peddamma Temple
Breaking: మరోసారి పెద్దమ్మ గుడి వద్ద శేజల్ ఆత్మహత్యాయత్నం
బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Mla durgam Chinnayya)పై ఆరోపణలు చేసిన శేజల్(Sejal) మరోసారి వార్తల్లో నిలిచింది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఆమె స్పృహ తప్పి పడిపోయింది. గురువారం మధ్యాహ్నం శేజల్ను ఆదినారాయణరావు అనే వ్యక్తి పెద్దమ్మ ఆలయం వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంత సేపటి వరకూ అక్కడే ఉన్న శేజల్..స్పృహ తప్పి పడిపోయింది. అయితే శేజల్(Sejal) బ్యాగ్లో నిద్రమాత్రలున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గతంలో కూడా శేజల్ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం(Sejal Suicide Attempt) చేసుకుంది. శేజల్(Sejal) బ్యాగులో నిద్రమాత్రలతో పాటుగా ఆమె రాసిన లెటర్ ఉంది. అందులో..ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని, పెద్దమ్మ తల్లే తనకు న్యాయం చేస్తుందని రాసి పెట్టి ఉంది. గత కొద్ది రోజులకు ముందు ఢిల్లీలో కూడా శేజల్ ఆత్మహత్యయత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.