KMR: రాజంపేటలో శుక్రవారం ఎస్సై రాజు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందం ప్రదర్శనల ద్వారా ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, ఫేక్ కాల్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచితులకు బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని ఎస్సై సూచించారు. అనుమానాస్పద లింకులపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.