సాధారణంగా యాడ్స్(Ads)లో ఎక్కువగా హీరోహీరోయిన్లు కనిపిస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్లు యాడ్స్‌లో నటించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా టాప్ డైరెక్టర్ రాజమౌళి(Director Rajamouli) ఓ యాడ్ ఫిలింలో నటించారు. స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఒప్పో(Oppo) కొత్త మోడల్ రెనో10 సిరీస్ ఫోన్ కోసం ఆయన యాడ్‌లో కనిపించారు.
ఒప్పో(Oppo) యాడ్ కోసం రాజమౌళి(Rajamouli) నటుడిగా మారి కనిపించడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్ విషయానికొస్తే ఇది 64 ఎంపీ టెలిఫొటో పోర్ట్రెయిట్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ యాడ్ ఫిలిం వీడియోను రాజమౌళి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.