ATP: గుత్తి గాంధీచౌక్ వద్ద కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల సీఐ రామారావు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎండలు అత్యధికంగా ఉండటంతో ప్రజలకు చల్లని నీటిని అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలను అభినందించారు.