KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు శుక్రవారం 2636.77 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పర్యవేక్షణలో ఖమ్మం జిల్లాకు 1136.77, భద్రాద్రి కొత్తగూడెంకు 300, మహబూబాబాద్‌కు 1000 టన్నుల చొప్పున పంపిణీ చేశారు. సొసైటీలతో పాటు ప్రైవేటు డీలర్లకు నిల్వలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు.