ప్రకాశం: ఈ ఏడాది పొగాకు రైతులకు సిగరెట్ సుంకం 18 నుంచి 40 శాతానికి పెంచడంతో సంక్షోభంలో ఉన్నారు. వచ్చే నెల 9వ తేదీన కొండపి పొగాకు వేలంకేంద్రం ప్రారంభం కానున్నట్లు అధికారులు ప్రకటించారు. పొగాకు బోర్డు 78 మిలియన్లకు అనుమతి ఇస్తే 120 మిలియన్ల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా, అంచనాకు మించి పొగాకు పండించటంతో వ్యాపారస్తులు అంతగా ఆసక్తి కనపరచట్లేదని తెలుస్తోంది.